Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మ్యాచు ఫిక్సింగ్ విచారణ నిజమే: కివీస్ బ్యాట్స్ మాన్ ల్యూవిన్సెంట్

మ్యాచు ఫిక్సింగ్ ఆరోపణలపై ఐసీసీ తనతోపాటు మరో ఇద్దరు న్యూజిలాండ్ ఆటగాళ్లపై విచారణ జరుపుతోందని.. ఆ దేశ ఆటగాడు ల్యూ విన్సెంట్ తెలిపారు. మిగతా ఇద్దరు ఆటగాళ్ళు ఎవరు? అన్నది ఆయన వెల్లడించలేదు. ఇప్పటి వరకూ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటగాళ్లు ఎవరో? అన్న సస్పెన్స్ కొనసాగుతున్న తరుణంలో, మొదటిసారిగా ల్యూ తన పేరును బయట పెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఐసీసీ విచారణకు సహకరిస్తానని.. విచారణ నేపథ్యంలో మరిన్ని వివరాలు వెల్లడించడం కుదరదని ల్యూ అన్నారు.

More Telugu News